Advertisement
Advertisement
Abn logo
Advertisement

మా లక్ష్యం అదే: షర్మిల

నారాయణపేట: నిరుపేదలను స్వయం సమృద్ధులను చేయటమే తమ లక్ష్యమని వైఎస్ షర్మిల అన్నారు. బీసీలకు చట్ట సభల్లో జనాభా ప్రకారం ప్రాతినిధ్యం కల్పిస్తేనే అభివృద్ధి అని ఆమె వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు ఉపఎన్నికల ముందే పథకాలు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. పాలకులు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాలు సరిగా స్పందించటం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు ధర వస్తుందని.. అమ్ముడు పోదామని ఎదురు చూస్తున్నారని షర్మిల చెప్పారు. తాము అధికారంలోకి రాగానే బీసీ నేతల విగ్రహాలు ట్యాంక్‌బండ్‌పై పెడతామన్నారు. కేంద్రప్రభుత్వం బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని షర్మిల కోరారు. 

Advertisement
Advertisement