Abn logo
Mar 21 2020 @ 08:54AM

మద్యం మత్తులో అంబులెన్స్‌ను ఢీకొట్టిన యువకులు

హైదరాబాద్: మద్యం మత్తులో కొందరు యువకులు అమ్మ హాస్పిటల్ అంబులెన్స్‌ను ఢీ కొట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మన్నెగూడలో పుట్టినరోజు వేడుకలకు హాజరైన 9మంది యువకులు.. అక్కడి నుంచి సరూర్ నగర్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. హస్తినాపురంలోని అమ్మ హాస్పిటల్ రోడ్డులో అతి వేగంగా మద్యం మత్తులో వాహనం నడపుతూ అంబులెన్స్‌ను ఢీకొట్టారు.


కారులో మద్యం బాటిల్స్, చికెన్‌ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో సదరు యువకులు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలాన్ని ఎల్‌బీ నగర్ నైట్ ఇన్‌చార్జి డీసీపీ యాదగిరి పరిశీలించారు. సీసీ కెమెరా ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement