ఐపీఎల్ 2022లో ఇండియన్ యంగ్ పేసర్ల సత్తా

ABN , First Publish Date - 2022-04-28T03:19:33+05:30 IST

ముంబై : యంగ్ ఇండియన్ పేసర్లు ఐపీఎల్ 2022 సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. నిప్పులు చెరిగే బంతులు సంధిస్తూ తమ ప్రతిభ చాటుకుంటున్నారు.

ఐపీఎల్ 2022లో ఇండియన్ యంగ్ పేసర్ల సత్తా

ముంబై : యంగ్ ఇండియన్ పేసర్లు ఐపీఎల్ 2022 సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. నిప్పులు చెరిగే బంతులు సంధిస్తూ తమ ప్రతిభ చాటుకుంటున్నారు. కట్టుదిట్టమైన లైనప్‌తో బ్యాట్స్‌మెన్లను కట్టడి చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఆకట్టుకుంటున్న యంగ్ పేసర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఒకడు.  స్థిరంగా వేగవంతమైన బంతులు వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. గంటకు 150 కిలోమీటర్ల దగ్గర వేగంతో బాల్స్ వేస్తున్నా లయ తప్పడం లేదు. సాధారణంగా ఉమ్రాన్ మాలిక్ స్థాయి వేగంతో బంతులు వేసేవారు వికెట్లకు దూరంగా బంతులు విసురుతుండడం చూస్తుంటాం. కానీ ఉమ్రాన్ మాలిక్ వికెట్లకు దూరంగా వేస్తున్న బంతులు చాలా తక్కువగా ఉంటున్నాయి. వికెట్ టు వికెట్ బౌలింగ్ వేస్తే మరింత మంచి బౌలర్‌గా రాటుదేలతాడని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 


ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్ సింగ్ కూడా ఇరగదీస్తున్నాడు. చక్కటి యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ పేసర్ జాతీయ జట్టులోకి అడుగుపెట్టడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ పేసర్ కుల్దీప్ సేన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చక్కటి లెంగ్త్‌ బాల్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడుతున్న పేసర్ ముకేష్ చౌదరి ఇన్నింగ్స్ ఆరంభంలోనే స్వింగ్ రాబడుతున్నాడు. బంతులను అంత సులభంగా బ్యాట్స్‌మెన్‌కు దొరకనీయడం లేదు. గుజరాత్ టైటాన్స్‌కి ఆడుతున్న 24 ఏళ్ల యంగ్ పేసర్ యస్ దయాల్.. ట్రికీ షార్ట్ బాల్స్ వేస్తున్నాడు. యంగ్ పేసర్లంతా ఇలా ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫైర్ అవ్వుతూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు.

Updated Date - 2022-04-28T03:19:33+05:30 IST