మీరే ఈ కుటుంబానికి మిగిలిన ఒకే ఒక్క ఆశ...

ABN , First Publish Date - 2021-08-05T22:04:31+05:30 IST

దేవా, మాకు సంతానాన్ని ప్రసాదించు...* నిరంతరం ఎలిజబెత్ చేసే ప్రార్థన ఇది. కానీ, తన కడుపు పండి ఈ ప్రపంచంలోకి రాబోయే తన బిడ్డ నానా అగచాట్లకు గురికానున్నట్టు పాపం ఆ తల్లికి.....

మీరే ఈ కుటుంబానికి మిగిలిన ఒకే ఒక్క ఆశ...

దేవా, మాకు సంతానాన్ని ప్రసాదించు...* నిరంతరం ఎలిజబెత్ చేసే ప్రార్థన ఇది. కానీ, తన కడుపు పండి ఈ ప్రపంచంలోకి రాబోయే తన బిడ్డ నానా అగచాట్లకు గురికానున్నట్టు పాపం ఆ తల్లికి తెలియనే తెలియదు.


ఏ తల్లయినా తన సంతానం ఆరోగ్యకరంగా, ఆనందంగా జీవించాలని మనసారా కోరుకుంటుంది. కానీ, దురదృష్టం ఏమిటంటే... పుట్టిన నాటి నుంచీ బతకడానికి పోరాటం చేస్తున్న తనకు కొడుకును చూస్తూ ఎలిజబెత్ ప్రతి రోజూ తీవ్ర మనోవేదన పడాల్సి వస్తోంది.


ఈ ఏడాది మార్చి నెలలో ఎలిజబెత్, శివకుమార్ దంపతులు ముద్దుల బాబుకు జన్మనిచ్చారు. కానీ, నెలలు నిండకుండా పుట్టడంతో ఆ తల్లిదండ్రులకు భయానకమైన స్థితి ఎదురైంది.


ఎలిజబెత్ గర్భవతిగా ఉన్నప్పుడు ఒకరోజున కడుపు మెలిపెట్టేస్తున్నట్టుగా వచ్చిన భరించలేని నొప్పి ఆమెకు నరకాన్ని చూపించింది. ఆమె గర్భాశయం నుంచి రక్తస్రావం మొదలైంది. ప్రసవానికి ఇంకా సమయం ఉందని ఆమెకు తెలుసు.


'అంత దారుణమైన నొప్పి నాకు ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదు. రక్తస్రావం ఆగలేదు. నన్ను తీవ్రంగా మైకం కమ్మేసింది'... అంటూ ఆ రోజులు గుర్తు చేసుకుంది ఎలిజబెత్.


ఈ లింకుపై క్లిక్ చేసి ఎలిజబెత్ కుమారుడికి సాయం చేసి ప్రాణం పోయండి



ఎలిజబెత్ రక్తపోటులో తీవ్రమైన మార్పులు చోటు చేసుకోవడంతో ఆమెను వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. గర్భస్రావం జరిగేంతటి ప్రమాదకర స్థితిలో ఆమె ఉండటం వల్ల ఈరోడ్ ఎమర్జెన్సీ కేర్ డాక్టర్లు ఆమెకు పురుడు పోశారు. పుట్టిన బాబు అత్యంత బలహీనంగా, ఈ వాతావరణాన్ని తట్టుకోలేనంత సున్నితంగా ఉండటంతో NICUలో ఉంచారు.


శివకుమార్ ఒక కూలీ. తన నెల సంపాదన కేవలం రూ.5,000. శివకుమార్, ఎలిజబెత్‌ల ఈ నవజాత శిశువు మూత్రపిండాల సమస్య, శ్వాస సంబంధ ఇబ్బందులతో పాటు మూర్ఛకు కూడా గురవుతుండటంతో బాబుకు వైద్యం చెయ్యాడానికి రూ.10 లక్షలు ($ 13441.25) సిద్ధం చేసుకోమని సూచించారు.




అంతంతమాత్రం సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న శివకుమార్‌కి ఇంత డబ్బు ఎలా సమకూర్చుకోవాలో అర్థం కాని పరిస్థితి. తమ పసివాడి పరిస్థితి కారణంగా మానసిక వ్యథతో ఆందోళన చెందుతున్న ఆ తల్లిదండ్రులు నిస్సహాయతకు లోనయ్యారు. కూలీగా పనిచేస్తున్న శివకుమార్‌కి బ్యాంక్ లోన్ దొరికే అవకాశం ఎంతమాత్రం లేదు.


ఇప్పుడు, ఈ నిరుపేద కుటుంబానికి మిగిలిన ఒకే ఒక్క ఆశ మీరు మాత్రమే.


దురదృష్టవశాత్తు ఎలిజబెత్‌కు కొన్ని సంవత్సరాల క్రితం గర్భస్రావం జరిగి ఆమె మనస్సుపై చెరిగిపోని ముద్ర వేసింది. ఆ వేదనను చెరిపేస్తూ ఇప్పుడు పుట్టిన ఈ ముద్దులొలికే పసివాడు ఆమెకు దూరమైతే ఆ ఆవేదన ఆమె జీవితాన్ని శాశ్వతంగా ముంచెత్తుతుంది.


ఎలిజబెత్‌కు అలాంటి పరిస్థితి రానివ్వకండి... పెద్ద మనస్సుతో నిండు హృదయంతో విరాళం ఇవ్వండి.

Updated Date - 2021-08-05T22:04:31+05:30 IST