Abn logo

దహీ అంజీర్‌ కబాబ్‌

కావలసినవి: అంజీర్‌ - 100గ్రాములు, పెరుగు - పావుకేజీ, పనీర్‌ - 400గ్రాములు, సెనగపిండి(వేగించినది) - 150గ్రాములు, బ్రెడ్‌ ముక్కలు - 150గ్రాములు, అల్లం - 50గ్రాములు, పచ్చిమిర్చి - 25గ్రాములు, కొత్తిమీర - 50 గ్రాములు, నెయ్యి - 200గ్రాములు, గరంమసాలా - 40 గ్రాములు, యాలకుల పొడి - 15 గ్రాములు, జీలకర్రపొడి(వేగించినవి) - 10 గ్రాములు, ఉప్పు - తగినంత.


తయారీ: ఒక పాత్రలో పెరుగు తీసుకొని అందులో పనీర్‌, అల్లం, పచ్చిమర్చి, కొత్తిమీర, గరంమసాలా, యాలకుల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత సెనగపిండి, బ్రెడ్‌ ముక్కలు వేసి చేత్తో నెమ్మదిగా మరోసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేయాలి. ఒక్కో ఉండను వెడల్పుగా చేసుకుంటూ మధ్యలో అంజీర్‌ పెట్టి ఒత్తుకోవాలి. పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక కబాబ్‌లు వేసి వేగించాలి. ఈ కబాబ్‌లను పుదీనా చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.

కట్‌లెట్స్‌వెర్మిసెల్లీ బర్ఫీసేమ్యా దోశసేమ్యా ఇడ్లీవెర్మిసెల్లీ బైట్స్‌సేమ్యా ఉప్మామ్యాగీ న్యూడిల్ కట్లెట్స్పొటాటో లాలిపాప్స్బ్రెడ్ బజ్జీ (వీడియో)టార్ట్‌ ఛాట్‌
Advertisement
d_article_rhs_ad_1
Advertisement