గుంటూరు: నరసరావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఇన్‌చార్జ్ అరవింద్‌బాబుపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. నారా లోకేష్ చారిటుబుల్ ట్రస్ట్ కార్యక్రమం దగ్గర వైసీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. ప్రతి ఆదివారం నారా లోకేష్ చారిట్రబుల్ ట్రస్ట్ దగ్గర గుడ్లు, బ్రెడ్లు పంపిణీ చేస్తారు. గుడ్లు పంపిణీ చేసేందుకు టీడీపీ ఇన్ ఛార్జ్ అరవింద్ బాబు అక్కడకు వెళ్లారు. దీంతో వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. టీడీపీ శ్రేణులు ప్రతిఘటించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.