Advertisement
Advertisement
Abn logo
Advertisement

చంద్రబాబు ఏనాడు కంటతడి పెట్టలేదు: టీడీపీ మహిళా నేత వేగుంట రాణీ

గుంటూరు: సత్తెనపల్లి బస్టాండ్ సెంటర్‌లో సీఎం జగన్, ఎమ్మెల్యే అంబటి దిష్టిబొమ్మలను టీడీపీ నేతలు దాహనం చేశారు. సీఎం, అంబటి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏనాడు కంటతడి పెట్టలేదని టీడీపీ మహిళా నేత వేగుంట రాణీ అన్నారు. భువనేశ్వరి మాజీ ముఖ్యమంత్రి కూతురు అనే సంస్కారం కూడా మరచిపోయారని టీడీపీ మహిళా నేత వేగుంట రాణీ విమర్శించారు. మంత్రి పదవుల కోసం ముఖ్యమంత్రి మెప్పుకోసం తహతహలాడుతున్నారని ఆమె మండిపడ్డారు. అసెంబ్లీలో ఉన్నది ఎమ్మెల్యేలు కాదు యదవలు, అంబటి చరిత్ర సోషల్ మీడియాకు తెలుసు అని ఆమె అన్నారు. కుక్కకి అంబటికి తేడా లేదని, వ్యక్తిగత దూషణలు చేసి అసెంబ్లీలో పైశాచిక ఆనందం పొందుతున్నారని వేగుంట రాణీ మండిపడ్డారు. మహిళల గురించి మాట్లాడే హక్కు అంబటికి లేదని టీడీపీ మహిళా నేత వేగుంట రాణీ అన్నారు. వైసీపీ ప్రభుత్వం పతనాన్ని కోరుకుంటుందని టీడీపీ మహిళా నేత వేగుంట రాణీ తెలిపారు.

Advertisement
Advertisement