Abn logo
Apr 9 2020 @ 19:42PM

వైసీపీ ఎమ్మెల్యే బంధువునంటూ మంచిర్యాలలో వైద్యుడు హల్‌చల్

హైదరాబాద్: ఏపీ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ బంధువునంటూ మంచిర్యాలలో ఓ వైద్యుడు హల్‌చల్ చేశారు. లాక్‌డౌన్ పరిణామాలతో మంచిర్యాలలో వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలో ఏపీ ఎమ్మెల్యే స్టిక్కర్‌‌తో వెళ్తున్న వాహనాన్ని పోలీసులు ఆపారు. దీంతో వాహనంలో ఉన్న వైద్యుడు సహనం కోల్పొయాడు. ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండగా ఎందుకు ఆపారంటూ రెచ్చిపోయాడు. ఎమ్మెల్యే జోగి రమేష్ తనకు బంధువు అని చెప్పారు. తననే ఆపుతారా అంటూ పోలీసులను ప్రశ్నించారు. దీంతో ఆ వాహనాన్ని పోలీస్‌స్టేషన్ వద్ద కొంతసేపు ఉంచి వదిలివేశారు. ఈ దృశ్యాలను చిత్రిస్తున్న మీడియా ప్రతినిధులపై వైద్యుడు చిర్రుబుర్రులాడారు. 

Advertisement
Advertisement
Advertisement