నెల్లూరు: కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రెచ్చిపోయారు. మీడియాపై అక్కసు వెల్లగక్కారు. నిజాలు రాసినందుకు ఏబీన్, ఆంధ్రజ్యోతి రిపోర్టర్లపై ప్రసన్నకుమార్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారు. ఏబీఎన్ రిపోర్టర్ ఏమనుకుంటున్నాడని, వాడిని, వాడి కుటుంబాన్ని నియోజకవర్గంలో లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. తాను, అనిల్ ప్రజలకి అందుబాటులో లేమని ఆంధ్రజ్యోతిలో రాస్తారా.. ఏమనుకుంటున్నారంటూ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నోరు పారేసుకున్నారు.