పార్వతీపురం మన్యం: జిల్లాలోని చెల్లంనాయుడువలసలో ఎమ్మెల్యే జోగారావు గడప గడప కార్యక్రమాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేని అడ్డుకున్న వారిలో వైసీపీ రెండో వర్గం కావటం విశేషం. అర్హులకు పథకాలు అందటం లేదని చెల్లంనాయుడువలసలో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే జోగారావు సర్ధి చెబుతున్నా వైసీపీ తిరుగుబాటు వర్గం శాంతించని పరిస్థితి నెలకొంది.
ఇవి కూడా చదవండి