Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు

అనంతపురం : హిందూపురం వైసీపీ నేతల పలువురిని కర్ణాటక పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. దొంగ బంగారం వ్యవహారంలో హిందూపురం వైసీపీ నేతల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులో ఓ దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని కర్ణాటక పోలీసులు విచారణ నిర్వహించారు. ముఠా సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు హిందూపురంలోని ముగ్గురు వైసీపీ నేతల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. అనంతరం వైసీపీ నేతలను అదుపులోకి తీసుకొని బెంగళూరుకు తీసుకెళ్లే యత్నం చేశారు. కర్ణాటక పోలీసులు వాహనాలను అడ్డుకుని వైసీపీ నేతలు రచ్చ చేశారు. స్థానిక పోలీసుల సహాయంతో అదుపులోకి తీసుకున్న వైసీపీ నేతలను కర్ణాటక పోలీసులు బెంగళూరుకు తీసుకెళ్లారు.

Advertisement
Advertisement