అత్యంత రహస్యంగా పేకాట క్లబ్ రన్.. కదులుతోన్న డొంక

ABN , First Publish Date - 2020-08-07T03:14:56+05:30 IST

అధికార పార్టీ లీడర్ సంపన్నులే టార్గెట్‌గా అత్యంత రహస్యంగా పేకాట క్లబ్ రన్ చేశారు. ..

అత్యంత రహస్యంగా పేకాట క్లబ్ రన్.. కదులుతోన్న డొంక

గుంటూరు: అధికార పార్టీ లీడర్ సంపన్నులే టార్గెట్‌గా అత్యంత రహస్యంగా పేకాట క్లబ్ రన్ చేశారు. అనుకున్నట్లుగా అందినకాడికి దండుకున్నాడు. డామిట్ కథ అడ్డం తిరిగింది. ఇంతకి ఆ లీడర్ పాపం ఎలా పండింది?. పోలీసులకు అడ్డంగా దొరికిపోయేందుకు సమాచారం ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరు?. ఆ నాయకుడు ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు ఎందుకు చర్చనీయాంశమైంది. 


గుంటూరు జిల్లాలో బట్టబయలైన పేకాట క్లబ్ వ్యవహారంలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. గుంటూరు, విజయవాడ జాతీయ రహదారిలో ఓ అపార్ట్‌మెంట్‌పై గత నెల్లో పోలీసులు మరుపుదాడి చేశారు. అక్కడ దర్జాగా పేకాట ఆడుతున్న పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పోలీసుల కళ్లు గప్పి కీలక వ్యక్తి తప్పించుకున్నాడు. పేకాట క్లబ్ ప్రధాన నిర్వాహకుడికి  అధికార పార్టీ ఎమ్మెల్యేతో సత్సంబంధాలు ఉండటంతో అరెస్ట్ చేయడంలేదనే ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అతడిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అనుచరుల్లో ఒకరు చలివేంద్రం సురేశ్. తనకు ఎమ్మెల్యే అండ ఉందని ఏం చేసినా చెల్లుతుందనుకున్నాడో ఏమో ఈజీ మనీ కోసం పెద్ద ప్లాన్ చేశాడు. 


Updated Date - 2020-08-07T03:14:56+05:30 IST