కర్నూలు జిల్లాలో వైసీపీ హవా

ABN , First Publish Date - 2021-03-14T21:44:48+05:30 IST

జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికలల్లో వైసీపీ హవా

కర్నూలు జిల్లాలో వైసీపీ హవా

కర్నూలు:  జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికలల్లో వైసీపీ హవా కొనసాగింది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్, ఒక నగర పంచాయతీని వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీకి తిరుగులేని విజయాన్ని ఓటర్లు అందించారు. ఎంతో ఆశలు పెట్టుకున్న టీడీపీకి పరాభావం తప్పలేదు. జనసేన పత్తా లేకుండా పోయింది. దాదాపుగా టీడీపీకి సమానంగా ఇండిపెండెంట్స్ సీట్లు సాధించారు. డోన్ మున్సిపాలిటీలో సీపీఎంబోణీ కొట్టింది. డోన్‌లో టీడీపీ కొట్టుకుపోయింది. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ, గూడూరు నగర పంచాయతీలో బీజేపీ కొంతమేర ప్రభావం చూపెట్టింది. ఆత్మకూరు మున్సిపాలిటీలో టీడీపీకి 1 సీటు రాగా 2 చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు.  


 



కర్నూల్ కార్పొరేషన్: నగరంలో మొత్తం 52 వార్డులు ఉన్నాయి. వీటిలో ఏకగ్రీవాలను కలుపుకొని మొత్తం 41 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. టీడీపీ 8 చోట్ల విజయం సాధించింది. ఇండిపెండెంట్లు 3 చోట్ల విజయం సాధించి తమ సత్తా చాటుకున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్‌‌గా వైసీపీ అభ్యర్థులు ఉండనున్నారు. 


ఆదోని మున్సిపాలిటీ: ఆదోని మున్సిపాలిటీలో  ఏకపక్ష విజయాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చింది. ఈ మున్సిపాలిటీలో ఉన్న 42 వార్డులకు గాను 40వార్డులలో వైసీపీ విజయ పతాకం ఎగురవేసింది. టీడీపీ 1 స్థానంలో, ఇండిపెండెంట్ 1 స్థానంలో విజయం సాధించారు. 


డోన్ మున్సిపాలిటీ: ఈ మున్సిపాలిటీలోకూడా ఏకపక్ష విజయాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. మొత్తం 32 వార్డులకు గాను ఏకగ్రీవాలను కలుపుకొని 31 స్థానాలలో వైసీపీ తిరుగులేని విజయాన్ని సాధించింది. 1 స్థానంలో సీపీఎం గెలుపొందింది. ఇక్కడ టీడీపీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. ఇక్కడ టీడీపీకి చావు దెబ్బ తగిలింది. ఇక్కడ జనసేన అడ్రస్ గల్లంతయింది. 


ఆళ్లగడ్డ మున్సిపాలిటీ: ఈ మున్సిపాలిటీలో మొత్తం 27 వార్డులు ఉన్నాయి. వీటిలోని ఏకగ్రీవాలను కలుపుకొని 22 స్థానాలలో  వైసీపీ విజయం సాధించింది. 2 చోట్ల టీడీపీ, 2 చోట్ల బీజేపీ, 1 చోట ఇండిపెండెంట్ విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీలో బీజేపీ బోణీ కొటింది. 


ఆత్మకూరు మున్సిపాలిటీ : ఈ ఈ మున్సిపాలిటీలోకూడా ఏకపక్ష విజయాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. మొత్తం 24 వార్డులుఉన్నాయి. వీటిలో ఏకగ్రీవాలు కలుపుకొని 21 స్థానాలలో  వైసీపీ విజయం సాధించింది. 1 చోట  టీడీపీ, 2 చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు.  



ఎమ్మిగనూరు మున్సిపాలిటీ: ఈ మున్సిపాలిటీలో 34 వార్డులు ఉన్నాయి. వీటిలో 31 స్థానాలను వైసీపీ సొంతం చేసుకుంది. కేవలం 3 స్థానాలలో టీడీపీ విజయం సాధించింది. 


నందికొట్కూరు మున్సిపాలిటీ: ఈ మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉన్నాయి.  ఏకగ్రీవాలను కలుపుకొని 21 స్థానాలలో వైసీపీ విజయం సాధించింది. 1 చోట టీడీపీ గెలుపొందింది. 7 చోట్ల ఇండిపెండెంట్స్ విజయం సాధించారు. ఇక్కడ టీడీపీ కన్నా ఇండిపెండెంట్స్  ఎక్కువ స్థానాలలో విజయం సాధించారు. 


నంద్యాల మున్సిపాలిటీ: ఏకగ్రీవాలను కలుపుకొని 37 స్థానాలలో వైసీపీ ఘన విజయం సాధించింది. 4 చోట్ల టీడీపీ, 1 చోట ఇండిపెండెంట్ విజయం సాధించారు. ఈ  మున్సిపాలిటీలో మొత్తం 42 వార్డులు ఉన్నాయి. 


గూడూరు నగర పంచాయతీ: ఇక్కడ మొత్తం  20వార్డులు ఉన్నాయి. 12 వార్డులలో వైసీపీ విజయం సాధించింది. 3 వార్డులలో టీడీపీ, 1 వార్డులో బీజేపీ, 4 వార్డులలో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. 


Updated Date - 2021-03-14T21:44:48+05:30 IST