Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ దాడి.. సిగ్గుమాలిన చర్య.. : టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్

విశాఖపట్నం: మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ నేతలు గూండాలను పెట్టి దాడి చేయించడం సిగ్గుమాలిన చర్య అని  టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ విమర్శించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేత ఇంటిపై జరిగిన దాడికి రాష్ట్ర డీజీపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటన పిరికిపంద చర్యకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రతిపక్షనేతకు భద్రత కల్పించలేని డీజీపీ.. పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.


జోగి రమేష్.. కేవలం మంత్రి పదవి కోసం రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఇంత దారుణానికి తెగబడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయన్నారు. వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్న రాష్ట్ర డీజీపీపై గవర్నర్ చర్యలు తీసుకుని.. రాష్ట్రపతి పాలన విధించాలని వ్యాఖ్యానించారు. చేతగాని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని దుయ్యబట్టారు. జోగి రమేష్‌పై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇల్లు ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement