ప్రాంతీయ భాషల విషయంలో కేంద్రం దుర్మార్గంగా ఆలోచిస్తోంది: యార్లగడ్డ

ABN , First Publish Date - 2021-04-06T17:15:32+05:30 IST

ప్రాంతీయ భాషల విషయంలో కేంద్రం దుర్మార్గంగా ఆలోచిస్తోందని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విమర్శించారు.

ప్రాంతీయ భాషల విషయంలో కేంద్రం దుర్మార్గంగా ఆలోచిస్తోంది: యార్లగడ్డ

విజయవాడ: ప్రాంతీయ భాషల విషయంలో కేంద్రం దుర్మార్గంగా ఆలోచిస్తోందని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ తమిళ, సంస్కృత, తెలుగు, కన్నడ, మళయాళం, ఒరియా భాషలకు ప్రాచీన భాషలుగా హోదా ఇచ్చారన్నారు. తెలుగు భాషా విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరులో ఏర్పాటు చేశారని భాషా పరిశోధన సంస్ధలను అన్నీ కలిపి ఒక యూనివర్శిటీగా మార్చాలని కేంద్రం నిర్ణయించిందని, అలా చేస్తే పరిశోధనకు ఉన్న ప్రాధాన్యత మరుగున పడిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గోపాలస్వామి కమిటీలో తెలుగువారికి చోటు లేదని, కేంద్ర ప్రభుత్వం విశిష్ట అధ్యన కేంద్రాలను కొనసాగించాలని యార్లగడ్డ సూచించారు.

Updated Date - 2021-04-06T17:15:32+05:30 IST