Yanamala: లేని అధికారంతో ఇప్పుడు అసెంబ్లీలో ఎలాంటి బిల్లు పెట్టలేరు...

ABN , First Publish Date - 2022-09-14T20:41:50+05:30 IST

రాజధాని మార్పు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదంటూ రాజ్యసభలో విజయసాయి...

Yanamala: లేని అధికారంతో ఇప్పుడు అసెంబ్లీలో ఎలాంటి బిల్లు పెట్టలేరు...

అమరావతి (Amaravathi): రాజధాని (Capital) మార్పు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదంటూ రాజ్యసభలో విజయసాయి (Vijayasai) ప్రయివేటు బిల్లు పెట్టారని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తి గత ఏజండా మీద అధికార పార్టీ దృష్టి సారిస్తోందన్నారు. లేని అధికారంతో ఇప్పుడు అసెంబ్లీలో ఎలాంటి బిల్లు పెట్టలేరని అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతేనని హైకోర్టు స్పష్టం చేయటంతో పాటు ఈ అంశం సుప్రీంకోర్టు (Supreme Court) వరకు వెళ్లి వచ్చిందన్నారు. న్యాయస్థానం తీర్పులను ఉల్లంఘించాలనుకోవటం మూర్ఖత్వమే అవుతుందన్నారు. అసెంబ్లీ సమావేశాలు రాజ్యాంగ పరంగా పెట్టాలి.. కాబట్టి పెడుతున్నారు తప్ప ప్రజాసమస్యల కోసం కాదన్నారు. అమరావతిపై అవగాహన లేని ఒక్కో మంత్రి ఒక్కో పొంతన లేని ప్రకటన చేస్తున్నారని విమర్శించారు. దీనిపై చర్చకు తామెప్పుడూ సిద్ధమేనన్నారు. చర్చకు రాలేకనే మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అధిక ధరలు, అమరావతి, పోలవరం, ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం వంటి అనేక ప్రజాసమస్యలపై ఉభయసభల్లో చర్చకు పట్టుబడతామన్నారు. ప్రజా సమస్యలు లేవనెత్తితే సస్పెండ్ చేస్తామనే ధోరణి ప్రభుత్వానికి సరికాదని యనమల రామకృష్ణుడు అన్నారు.

Updated Date - 2022-09-14T20:41:50+05:30 IST