కళా వెంకట్రావు అరెస్టును ఖండించిన యనమల

ABN , First Publish Date - 2021-01-21T22:34:17+05:30 IST

టీడీపీ నేత కళా వెంకట్రావు అరెస్టును ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఖండించారు. భోజనం కూడా చేయనీయకుండా

కళా వెంకట్రావు అరెస్టును ఖండించిన యనమల

విజయవాడ: టీడీపీ నేత కళా వెంకట్రావు అరెస్టును ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఖండించారు. భోజనం కూడా చేయనీయకుండా లాక్కెళ్లడం అమానుషం అన్నారు. 41 నోటీస్ ఇచ్చేందుకు వందలాది పోలీసులను ఇంటికి పంపించాలా? తిరుపతిలో టీడీపీ నేతల అక్రమ నిర్భంధం దారుణం అని తెలిపారు. బీసీలపై జగన్‌రెడ్డి కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్‌రెడ్డికి త్వరలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని యనమల వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-01-21T22:34:17+05:30 IST