Abn logo
Feb 14 2020 @ 17:37PM

ఇంగ్లీష్‌ ప్రెస్‌నోట్‌ వైసీపీ నేతలకు అర్థంకావట్లేదు: యనమల

అమరావతి: ఇంగ్లీష్‌ ప్రెస్‌నోట్‌ వైసీపీ నేతలకు అర్థంకావట్లేదని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవాచేశారు. 3 ఇన్‌ఫ్రా కంపెనీలు, సబ్‌ కాంట్రాక్టర్ల లావాదేవీలపై దాడులు చేశామని ఐటీశాఖ ప్రకటన విడుదల చేసిందన్నారు. ఈ మూడు కంపెనీలు వైసీపీకి చెందినవేనని తెలిపారు. మనీ ల్యాండరింగ్‌, షెల్‌ కంపెనీల ఏర్పాటులో వైసీపీ నేతలు సిద్ధహస్తులని ఆరోపించారు. అందుకే సీఎం జగన్‌ జైలు, కోర్టు చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. మూడో పేరాలో పేర్కొన్న మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ వ్యవహారంతో.. రెండో పేరాలో ఉన్న అంశాలకు సంబంధం లేదని  యనమల తోచిపుచ్చారు. మాజీ పీఎస్‌ ఇంట్లో దాడుల్లో ఏమీ దొరకలేదని అందరికీ తెలుసన్నారు. రాష్ట్ర సంపదను దోచుకుంటున్న వైసీపీ నేతలు.. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలపై బురద చల్లాలని చూస్తున్నారని యనమల దుయ్యబట్టారు.

Advertisement
Advertisement
Advertisement