సెమీస్ లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌

ABN , First Publish Date - 2020-03-02T10:01:44+05:30 IST

సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ మహిళలజట్లు టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌కు చేరాయి. ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా 17 పరుగులతో పాకిస్థాన్‌పై

సెమీస్ లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌

మహిళల టీ20 వరల్డ్‌ కప్‌


సిడ్నీ: సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ మహిళలజట్లు టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌కు చేరాయి. ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా 17 పరుగులతో పాకిస్థాన్‌పై గెలుపొందగా, ఇంగ్లండ్‌ 46 రన్స్‌తో వెస్టిండీ్‌సను చిత్తు చేసింది. దీంతో భారత్‌తోపాటు సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ చివరి నాలుగు జట్లలో చోటు సంపాదించాయి. ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా చెరో ఆరేసి పాయింట్లతో సమంగా నిలిచినా..మెరుగైన నెట్‌ రన్‌రేట్‌తో ఇంగ్లండ్‌ గ్రూప్‌ ‘బి’ టాపర్‌గా నిలిచింది.  


వోల్వార్ట్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. ఒక దశలో 64/4తో కష్టాల్లోపడ్డ సౌతాఫ్రికా.. వోల్వార్ట్‌  (36 బంతుల్లో 8 ఫోర్లతో 53 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో మెరుగైన స్కోరు చేసింది. పాక్‌ బౌలర్లలో డయానా బేగ్‌ (2/19) రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం పాకిస్థాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 119 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. జవేరియా ఖాన్‌ (31), అలియా రియాజ్‌ (39 నాటౌట్‌), ఇరమ్‌ జావెద్‌ (17 నాటౌట్‌) మాత్రమే రాణించారు. 


స్కివర్‌ భళా..: వెస్టిండీ్‌సతో మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 143 పరుగులు చేసింది. నాట్‌ స్కివర్‌ (56 బంతుల్లో 6 ఫోర్లతో 57) హాఫ్‌ సెంచరీతో మరోసారి సత్తా చాటింది. ఛేదనలో వెస్టిండీస్‌ 17.1 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. లీ ఆన్‌ కిర్బీ (20) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. 

Updated Date - 2020-03-02T10:01:44+05:30 IST