Kuppam Town Bank ముందు మహిళా ఉద్యోగుల ధర్నా

ABN , First Publish Date - 2021-07-19T21:02:15+05:30 IST

కుప్పం టౌన్ బ్యాంక్ ముందు ఇద్దరు మహిళా ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఈ సంఘటనకు సంబంధించి కుప్పం టౌన్ బ్యాంక్‌లో ఈమధ్య వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి.

Kuppam Town Bank ముందు మహిళా ఉద్యోగుల ధర్నా

చిత్తూరు: కుప్పం టౌన్ బ్యాంక్ ముందు ఇద్దరు మహిళా ఉద్యోగులు ధర్నాకు దిగారు.  ఈ సంఘటనకు సంబంధించి కుప్పం టౌన్ బ్యాంక్‌లో ఈమధ్య వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. గతంలో రెండు కోట్ల దాకా బ్యాంక్‌లో గోల్ మాల్ జరిగింది.  ఇప్పుడు ఆ కుంభకోణానికి సంబంధం ఉందంటూ ఇన్‌చార్జ్ మేనేజర్ వేదవతి దేవి,  క్యాషియర్ దీప అనే ఇద్దరు మహిళా ఉద్యోగులను బ్యాంకు విధుల నుంచి తొలగించారు. దీంతో మహిళా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా మహిళా ఉద్యోగులు మాట్లాడుతూ.. సుమారు 20 సంవత్సరాలుగా బ్యాంకులో పని చేస్తున్నామని ఇంతవరకు తమపై ఎలాంటి చిన్న రిమార్క్ లేదని చెప్పారు.  తమకు ఏమీ తెలియదని ఇద్దరు మహిళ ఉద్యోగులు బ్యాక్ ముందు కూర్చుని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగం నుంచి తొలగిస్తే కుటుంబాలు రోడ్డున పడతాయని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-07-19T21:02:15+05:30 IST