ఆస్పత్రి గేటు వద్దే మహిళ ప్రసవం

ABN , First Publish Date - 2020-05-31T08:11:51+05:30 IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి పీహెచ్‌సీ గేటు వద్ద ఓ గర్భిణి శనివారం ఉదయం బిడ్డకు జన్మనిచ్చింది. బిహార్‌ రాష్ట్రానికి చెందిన లక్ష్మి దేవి పురిటినొప్పులతో తెల్లవారుజామున పీహెచ్‌సీకి వెళ్లింది.

ఆస్పత్రి గేటు వద్దే మహిళ ప్రసవం

అందుబాటులో లేని వైద్య సిబ్బంది.. 2 గంటలు నరకయాతన


మఠంపల్లి, మే 30: సూర్యాపేట జిల్లా మఠంపల్లి పీహెచ్‌సీ గేటు వద్ద ఓ గర్భిణి శనివారం ఉదయం బిడ్డకు జన్మనిచ్చింది. బిహార్‌ రాష్ట్రానికి చెందిన లక్ష్మి దేవి పురిటినొప్పులతో  తెల్లవారుజామున పీహెచ్‌సీకి వెళ్లింది. ఆ సమయంలో ఆస్పత్రి సిబ్బంది  అందుబాటులో లేరు. గేట్లకు తాళాలు వేసి ఉన్నాయి. సుమారు రెండు గంటల పాటు ఆమె యాతన అనుభవించింది. చివరకు అక్కడే మగబిడ్డకు జన్మనిచ్చింది. స్థానికుల సమాచారంతో  ఉదయం 6.30 గంటలకు వచ్చిన వైద్య సిబ్బంది.. 108లో హుజూర్‌నగర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పీహెచ్‌సీలో 12 మంది సిబ్బంది ఉండగా, శనివారం రాత్రి ముగ్గురు విధులు నిర్వహించాల్సి ఉంది. ఈ ముగ్గురూ ఆస్పత్రికి తాళం వేసి వెళ్లారు. ఘటన గురించి చెప్పడంతో ఉదయం 6.30 గంటకు వచ్చారని, లేదంటే ఎప్పుడు వచ్చేవారో తెలియదని స్థానికులు పేర్కొన్నారు.  29 పంచాయతీలకు సేవలందించాల్సిన ఈ పీహెచ్‌సీలో మహిళా వైద్యులు లేరు. ఉన్న ఒక్క డాక్టర్‌ ఉదయం మాత్రమే విధుల్లో ఉంటారు.

Updated Date - 2020-05-31T08:11:51+05:30 IST