Abn logo
Aug 8 2020 @ 19:51PM

పెళ్లి చర్చల్లో.. అమ్మాయి తండ్రిని పొడిచేసిన అబ్బాయి తండ్రి!

గురుగ్రామ్: పెళ్లి చర్చల కోసం కలిసిన రెండు కుటుంబాల మధ్య ఘర్షణ ఓ హత్యకు దారితీసింది. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గురుగ్రామ్‌కు చెందిన యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం తెలిసిన అతని తల్లిదండ్రులు అమ్మాయి కుటుంబాన్ని కలిసి మాట్లాడాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆ రెండు కుటుంబాలూ కలిశాయి. ఈ సమయంలో తన కుమార్తెను సదరు యువకుడికి ఇచ్చి వివాహం చేయడానికి అమ్మాయి తండ్రి అంగీకరించలేదు. దీంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ యువకుడి తండ్రి దగ్గరలో ఉన్న కత్తి తీసుకొని అమ్మాయి తండ్రిని పొడిచిపారేశాడు. ఈ ఘటనలో అమ్మాయి తండ్రి మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement
Advertisement
Advertisement