ప్రైవేట్ వీడియోను అడ్డుపెట్టుకుని.. అరబ్ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేయబోయిన మహిళ .. చివరకు

ABN , First Publish Date - 2020-03-26T16:59:18+05:30 IST

తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన వీడియోను అడ్డుపెట్టుకుని అరబ్ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి 2లక్షల బహ్రెయిన్ దిర్హామ్స్(రూ. 3,99,89,583) డిమాండ్ చేసిన మొరాకో మహిళను దుబాయ్ కోర్టు 6 నెలల జైలు, దేశబహిష్కరణ శిక్ష విధించింది.

ప్రైవేట్ వీడియోను అడ్డుపెట్టుకుని.. అరబ్ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేయబోయిన మహిళ .. చివరకు

దుబాయ్: తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన వీడియోను అడ్డుపెట్టుకుని అరబ్ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి 2లక్షల బహ్రెయిన్ దిర్హామ్స్(రూ. 3,99,89,583) డిమాండ్ చేసిన మొరాకో మహిళను దుబాయ్ కోర్టు 6 నెలల జైలు, దేశబహిష్కరణ శిక్ష విధించింది. అరబ్ వ్యక్తిని తన నివాసానికి పిలిపించుకుని అతనితో సదరు మహిళ శృంగారంలో పాల్గొంది. ఆ సమయంలో అతనికి తేలియకుండా ఫోటోలు, వీడియో తీసింది. అనంతరం వాటిని అడ్డుపెట్టుకుని ఫోన్ ద్వారా అతడిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టింది. తాను అడిగినన్ని డబ్బులు ఇవ్వకుంటే ఫోటోలు, వీడియోను బయట పెడతానని బెదిరించింది. దాంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలైన మొరాకో మహిళను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. తాజాగా ఆమెను దుబాయ్ కోర్టులో హాజరు పరిచారు. దీంతో దోషిగా తేలిన మహిళకు న్యాస్థానం శిక్షను ఖరారు చేసింది. 


కోర్టులో పేర్కొన్న వివరాల ప్రకారం...  బహ్రెయిన్ లో ఉండే వ్యక్తి(39)కి మొరాకోకు చెందిన మహిళ(22)తో ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైంది. దాంతో ఇద్దరు తరచూ చాటింగ్ చేసుకునేవారు. ఈ క్రమంలో ఒక రోజు మహిళ తాను యూఏఈలో ఉంటానని, బహ్రెయిన్ చూసేందుకు వచ్చానని చెప్పింది. గతేడాది అక్టోబర్ 6న తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నానని, నీవు వస్తే ఇద్దరం ఏకాంతంగా గడపొచ్చని వాట్సాప్ ద్వారా ఆమెకు సంబందించిన ఒక ప్రైవేట్ ఫోటో కూడా పంపించింది. దాంతో ఆ వ్యక్తి ఆమె చెప్పిన చోటుకు వెళ్ళాడు. అతను రాకముందే ప్రణాళిక ప్రకారం బెడ్ రూంలో కెమెరా ఏర్పాటు చేసింది. ఇంకేముంది  అతనితో సన్నిహితంగా ఉన్న సమయంలో  ఆ దృశ్యాలు అందులో రికార్డ్ అయ్యాయి.


అనంతరం ఆ ఫోటోలు, వీడియోను అక్టోబర్ 11న ఆ వ్యక్తికి పంపించింది. తనకు రూ. 3,99,89,583 ఇవ్వకుంటే వాటిని అంతర్జాలంలో పెడతానని బెదిరించింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళను అక్టోబర్ 24న అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి నెట్టారు. తాజాగా ఈ కేసు దుబాయ్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో తన నేరాన్ని అంగీకరించిన మొరాకో మహిళకు న్యాయస్థానం 6 నెలల జైలు శిక్ష విధించింది. అలాగే శిక్షకాలం పూర్తి అయిన వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించింది.

Updated Date - 2020-03-26T16:59:18+05:30 IST