ఖమ్మం: డబుల్ బెడ్ రూం ఇళ్ళకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలో తన పేరు తొలగించారని ఆరోపిస్తూ ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఖమ్మం అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వద్ద శ్రీదేవి అనే మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళను ఖమ్మం 42వ డివిజన్‌కు చెందిన డోన్ వాన్ శ్రీదేవిగా గుర్తించారు. ఆత్మహత్యాయత్నాన్ని తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది అడ్డుకున్నారు.