గుంటూరు: హోంమంత్రి సుచరిత ఇంటి వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. చిన్నారితో హోంమంత్రి ఇంటి వద్దకు ఆటోలో మహిళ వచ్చింది. ఆటోలో కూర్చుని పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హోం మంత్రి ఇంటి వద్ద ఉన్న సిబ్బంది వెంటనే ఆమెను జీజీహెచ్‌కు పోలీసులు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మహిళ వివరాలను అరండల్ పేట పోలీసులు సేకరిస్తున్నారు.