Advertisement
Advertisement
Abn logo
Advertisement

కలెక్టరేట్ ఎదుట మహిళ నిరసన

రాజన్న సిరిసిల్ల: మహిళా దినోత్సవం రోజున కూడా మహిళా రైతుకు ఇబ్బందులు తప్ప లేదు. తనకు న్యాయం చేయాలని కలెక్టరేట్ ఎదుట ఆ మహిళ నిరసనకు దిగింది. జిల్లాలోని ఇల్లంతకుంట మండలం ఓగులాపూర్ గ్రామానికి చెందిన లావణ్య అనే మహిళా రైతు వ్యవసాయం చేస్తోంది. తన భూమిలో వేసిన పంటలను కాపాడుకోవడానికి ఆ భూమిలో బోర్ వేసేందుకు ప్రయత్నించింది. తన భూమిలో లావణ్య బోర్ వేయడాన్ని గ్రామంలోని కొంతమంది అడ్డుకున్నారు.


వారి ఆగడాలు భరించలేక కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు డబ్బాను చేత పట్టుకుని నిరసన  తెలిపింది. అధికారులు వచ్చి తనకు న్యాయం చేయాలని కోరింది. ఈ సంఘటన పట్టణంలో కలకలం సృష్టించింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే కలెక్టరేట్‌కు చేరుకున్నారు. లావణ్యకు నచ్చచెప్పి ఆమెకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని పోలీసులు సర్దిచెప్పారు. 

Advertisement
Advertisement