Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉద్యోగం కోసం కెనడాకు వెళ్లి తిరిగి రావద్దనుకున్న వివాహిత.. ఇంతలో ఊహించని షాక్!

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగం నిమిత్తం కెనడాకు వెళ్లిన ఓ మహిళ అక్కడే ఉండిపోయేందుకు నిర్ణయించుకున్నారు. అక్కడ శ్వాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఆమెకు అత్తవారి నుంచి ఊహించని చిక్కులు ఎదురయ్యాయి. చివరికి ఆమె గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు.. కెనడాలోని భారత్ ఎంబసీకి నోటీసులు జారీ చేసింది. 

గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన పలక్ 2016లో ఉద్యోగం నిమిత్తం కెనడాకు వెళ్లారు.  ఆ తరువాత ఆమె భారత్‌కు తిరిగి రాలేదు. అక్కడే ఉండిపోయేందుకు నిర్ణయించుకున్న ఆమె..పర్మెనెంట్ రెసిడెన్స్ కోసం కెనడా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం పలక్‌కు భారత పోలీసుల నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరమవడంతో కెనడాలోని భారత ఎంబసీలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు గాంధీనగర్ పోలీసుల వద్దకు చేరింది. ఈ క్రమంలో కల్పించుకున్న భర్త, అతడి తరుపు వారు సర్టిఫికేట్ జారీలో అడ్డంకులు సృష్టించారు. ఈ విషయాన్ని పలక్ తరుపు లాయర్ కోర్టుకు తెలిపారు. ఈ కారణంగానే పలక్‌కు సర్టిఫికేట్ జారీలో ఆలస్యం అవుతోందని చెప్పుకొచ్చారు.  అయితే.. గుజరాత్ హైకోర్టు కెనడాలోకి భారతీయ ఎంబసీకి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై స్పందించాలంటూ ఎంబసీని కోరింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement