సోషల్ మీడియా ప్రచారం కోసం.. స్కూలుపిల్లలా వేషం వేసుకున్న యువతి అరెస్టు!

ABN , First Publish Date - 2021-05-14T04:00:38+05:30 IST

సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం చాలా మంది నానా తిప్పలూ పడుతుంటారు. దీనికి సరిగ్గా సరిపోయే ఘటన అమెరికాలో తాజాగా వెలుగు చూసింది. ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన ఒక 28 ఏళ్ల యువతి..

సోషల్ మీడియా ప్రచారం కోసం.. స్కూలుపిల్లలా వేషం వేసుకున్న యువతి అరెస్టు!

ఫ్లోరిడా: సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం చాలా మంది నానా తిప్పలూ పడుతుంటారు. దీనికి సరిగ్గా సరిపోయే ఘటన అమెరికాలో తాజాగా వెలుగు చూసింది. ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన ఒక 28 ఏళ్ల యువతి.. స్కూలు పిల్లలా వేషం వేసుకొని ఒక స్కూల్లోకి వెళ్లిపోయింది. అక్కడ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు సంబంధించిన వివరాలున్న పాంప్లెంట్లు విద్యార్థులకు పంచి పెట్టింది. ఇలా తన సోషల్ మీడియా ప్రమోషన్ చేసుకోవాలని అనుకుంది. అయితే ఆమె చేసిన పని హద్దు మీరడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.


ఆమె పేరు ఆడ్రీ నికోల్ ఫ్రాంకిస్కిని. 28 ఏళ్ల ఆమె.. స్కూలు బ్యాగు తగిలించుకొని, స్కేట్‌బోర్డు వేసుకొని విద్యార్థినిలా నటిస్తూ స్థానికంగా ఉన్న ఒక స్కూల్లోకి వెళ్లిపోయింది. అక్కడ తన ఇన్‌స్టా ఖాతాకు ప్రచారం చేసుకుంటూ.. విద్యార్థులను తన ఖాతా ఫాలో అవ్వాలని కోరింది. ఈ మొత్తాన్ని తన మొబైల్‌లో వీడియో కూడా తీసింది. ఆమె చేసిన పని బయటపడటంతో పోలీసులు ఆడ్రీని అరెస్టు చేశారు.

Updated Date - 2021-05-14T04:00:38+05:30 IST