ఢిల్లీ క్యాపిటల్స్‎పై సన్‎రైజర్స్ ఘన విజయం

ABN , First Publish Date - 2020-10-28T04:44:27+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‎లో సన్

ఢిల్లీ క్యాపిటల్స్‎పై సన్‎రైజర్స్ ఘన విజయం

దుబాయ్: ఐపీఎల్‌లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‎లో సన్ రైజర్స్ 88 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఢిల్లీ జట్టు ముందు హైదరాబాద్ టీమ్ 220 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.  అయితే.. 220 పరుగుల భారీ టార్గెట్‎తో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ ధావన్ ఫస్ట్ ఓవర్లోనే డకౌట్ రూపంలో వెనుతిరిగాడు. తర్వాత వచ్చిన స్టోయినిస్, హిట్ మెయిర్ వెంట వెంటనే ఔట్ కావడంతో ఢిల్లీ జట్టు 6.1 ఓవర్లలో 54 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతూ కష్టా్ల్లోపడింది. మరో ఓపెనర్ రహానే కూడా (26) రన్స్ కే ఔట్ కావడంతో ఢిల్లీ టీమ్ 54 రన్స్‎కే నాలుగు కీలకమైన టాప్ ఆర్డర్ వికెట్లను చేజార్చుకుంది. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, కెప్టెన్ అయ్యర్ ఇన్నింగ్స్‎ను చక్కదిద్దే క్రమంలో అయ్యర్ కూడా స్వల్ప స్కోర్‎కే ఔటయ్యాడు. ఆ తర్వాత రిషబ్ కూడా 36 పరుగులు చేసి వెనుతిరిగాడు.  దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 131పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. సన్ రైజర్స్ బౌలింగ్‎లో.. రషీద్ ఖాన్ మూడు వికెట్లు, సందీప్ శర్మ, నటరాజన్ కు రెండు వికెట్లు తీయగా..విజయ్ శంకర్, నదీమ్, హోల్డర్‎కు తలో వికెట్ దక్కాయి.


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‎కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహాలు పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. తొలి బంతి నుంచే బాదుడు మొదలుపెట్టారు. వారి దెబ్బకు స్కోరు బోర్డు జెట్ స్పీడ్‌తో పరుగులు తీసింది. అయితే.. సన్ రైజర్స్ బ్యాటింగ్‎లో 45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి సాహా మరో భారీ షాట్‌కు యత్నంచి ఔట్ కాగా..డెవిడ్ వార్నర్ 34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన మనీశ్ పాండే 31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 44పరుగులు చేయగా, విలియమ్సన్ 11 పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్ స్కోర్ 20 ఓవర్లలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 219 పరుగుల భారీ స్కోర్ ఢిల్లీ జట్టు ముందు నిర్ధేశించింది.

Updated Date - 2020-10-28T04:44:27+05:30 IST