మా ఆటగాళ్లపై వింబుల్డన్ నిషేధం సరికాదు: రష్యా

ABN , First Publish Date - 2022-04-20T23:47:52+05:30 IST

మాస్కో : తమ దేశ ఆటగాళ్లపై వింబుల్డన్ నిషేధం విధించాన్ని రష్యా తప్పుబట్టింది. ఈ నిర్ణయం ఆమోదయోగ్యంకాదని ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా టెన్నీస్ ఆటగాళ్లపై వింబుల్డన్

మా ఆటగాళ్లపై వింబుల్డన్ నిషేధం సరికాదు: రష్యా

మాస్కో : తమ దేశ ఆటగాళ్లపై వింబుల్డన్ నిషేధం విధించడాన్ని రష్యా తీవ్రంగా తప్పుబట్టింది. ఆటగాళ్లపై నిషేధం ఆమోదయోగ్యంకాదని ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా టెన్నీస్ ఆటగాళ్లపై వింబుల్డన్ నిషేధం విధించడం తగదని రష్యా ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు. బుధవారం రిపోర్టర్లతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. మరోసారి అథ్లెట్ల విషయంలో రాజకీయ పక్షపాతం చూపిస్తున్నారు.  ఇవి రాజకీయ కుట్రలు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా ఉక్రెయిన్‌పై దాడులకు పాల్పడుతున్న రష్యా అంతర్జాతీయంగా తీవ్ర ఆంక్షలను ఎదుర్కొంటోంది. చాలా దేశాలు ఇప్పటికే ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు విధించాయి. రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టాలనే ప్రయత్నంలో భాగంగా ఆంక్షలను మరింత  తీవ్రతరం చేస్తున్నాయి.

Updated Date - 2022-04-20T23:47:52+05:30 IST