అదే జరిగితే.. బ్యాట్స్‌మెన్లకు అనుకూలంగా మారుతుంది: ఇర్ఫాన్

ABN , First Publish Date - 2020-05-25T17:29:57+05:30 IST

ఐసీసీ తాజాగా విడుదల చేసిన విధివిధానాల్లో బంతికి ఉమ్మి పూయడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు

అదే జరిగితే.. బ్యాట్స్‌మెన్లకు అనుకూలంగా మారుతుంది: ఇర్ఫాన్

న్యూఢిల్లీ: ఐసీసీ తాజాగా విడుదల చేసిన విధివిధానాల్లో బంతికి ఉమ్మి పూయడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు మైనం లాంటి ఇతర పదార్థాలను పూయడానికి అనుమతించాలని కోరారు. కొందరు దీన్ని నిషేధంచడం కరెక్టక్ కాదని అంటున్నారు. తాజాగా ఈ విషయమై టీం ఇండియా పేస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. 


బంతికి ఉమ్మి పూయడాన్ని రద్దు చేస్తే.. అది బ్యాట్స్‌మెన్లకు మరింత అనుకూలంగా మారుతుందని పఠాన్ అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో పిచ్‌లను బౌలర్లకు అనుకూలంగా మార్చాలని అతను తెలిపాడు. బంతిని షైన్ చేయలేకపోతే.. కట్ చేయడం చాలా కష్టమని అతను అభిప్రాయపడ్డాడు.


‘‘బంతిని స్వింగ్ చేయలేకపోతే.. బ్యాట్స్‌మెన్‌కి చాలా అనుకూలంగా మారుతుంది. స్వింగ్, పేస్ కలిస్తేనే బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బంది పెట్టవచ్చు. నిషేధం చాలా మంది టెస్ట్ బౌలర్లపై ప్రభావం చూపుతుంది. వైట్‌ బాల్ క్రికెట్‌లో అది సమస్య కాదు. కానీ, రెడ్ బాల్‌లో స్పిన్నర్ అయినా.. ఫాస్ట్ బౌలర్ అయినా బంతిని షైన్ చేయాల్సిందే. లేకుంటే అది బ్యాట్స్‌మెన్‌కి చాలా అనుకూలంగా మారుతుంది’’ అని పఠాన్ తెలిపాడు. 

Updated Date - 2020-05-25T17:29:57+05:30 IST