40 ఏళ్ల రికార్డు బద్దలు

ABN , First Publish Date - 2022-03-14T14:00:02+05:30 IST

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ జట్టు పట్టు బిగించింది. రెండో రోజు టీమిండియా శ్రీలంకపై తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. పంత్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌కు తోడుగా.

40 ఏళ్ల రికార్డు బద్దలు

బెంగళూరు: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ జట్టు పట్టు బిగించింది. రెండో రోజు శ్రీలంకపై టీమిండియా జట్టు తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. పంత్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌కు తోడుగా..శ్రేయాస్‌ నిలకడైన ఆటతీరుతో భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది. దీంతో భారత్ జట్టు 447 పరుగుల టార్గెట్‎ను లంక ముందు ఉంచింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక జట్టు వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. ఇక రెండో టెస్టులో ఏదైనా అద్భుతం జరిగితే తప్పా టీమిండియా విజయాన్ని ఆపలేరు.


40 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన పంత్...

డాషింగ్‌ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యంత వేగవంతమైన (28 బంతుల్లో) అర్ధసెంచరీ సాధించాడు. దీంతో 40 ఏళ్లుగా కపిల్‌ పేరిట కొనసాగుతున్న రికార్డును బద్దలుకొట్టాడు. 1982లో కపిల్‌దేవ్‌ పాక్‌పై 30 బంతుల్లో నెలకొల్పిన ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ రికార్డు కనుమరుగైంది. ఓవరాల్‌గా ఈ ఫార్మాట్‌లో మిస్బా ఉల్‌ హక్‌ కేవలం 21 బంతుల్లోనే 50 రన్స్‌ సాధించి టాప్‌లో కొనసాగుతున్నాడు.

Updated Date - 2022-03-14T14:00:02+05:30 IST