Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

Relationship Secrets: Sushmita Sen కు 46 ఏళ్లు.. Lalit Modi కి 58 ఏళ్లు.. తనకంటే వయసులో చాలా పెద్దవారిని కూడా స్త్రీలు ఎందుకు ఇష్టపడతారంటే..

twitter-iconwatsapp-iconfb-icon
Relationship Secrets: Sushmita Sen కు 46 ఏళ్లు.. Lalit Modi కి 58 ఏళ్లు.. తనకంటే వయసులో చాలా పెద్దవారిని కూడా స్త్రీలు ఎందుకు ఇష్టపడతారంటే..

సుస్మితా సేన్ (Sushmita Sen) 46 ఏళ్లు, లలిత్ మోడీ(Lalit Modi)కి 58 ఏళ్లు వీళ్ళ వ్యవహారం ఈ రోజుల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలు పెద్ద వయసులో ఉన్న పార్టనర్‌లను ఇష్టపడటానికి కారణం ఏంటనేది అందరి మదిలో మెదిలే ఒకే ఒక ప్రశ్న. వయస్సు చూడకుండా, తనకన్నా పెద్ద వయసు మగవాడితో దగ్గరగా ఉన్న స్త్రీ అతనిలో ఏం చూస్తుంది అనేది నిజానికి పెద్ద చిక్కు ప్రశ్నే. 


ఇద్దరు కలిసి సహజీవనం చేయడం అనేది ఇప్పటి రోజులలో కామన్ గా మనం చూస్తున్న విషయమే.. కానీ తనకన్నా వయసులో చాలా పెద్దవాడైన మగవాడిని వయసులో ఉన్న అమ్మాయి ఇష్టపడి అతనితో రిలేషన్ని కొనసాగించడమే ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం. అమ్మాయిలు తమకన్నా పెద్దవయసు ఉన్న వ్యక్తులతో సాన్నిహిత్యాన్ని ఎందుకు ఇష్టపడతారు?


వయస్సు తేడా: బాలీవుడ్ నటి సుస్మితా సేన్ కూడా ఐపిఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ విషయంలో వయస్సు చూడలేదు. ఇప్పుడు అతనితో రిలేషన్లో ఉంది. సుస్మితా సేన్ వయసు 46 ఏళ్లు, లలిత్ మోదీకి 60 ఏళ్లు దాటింది. అసలు ఆడవారు తమ వయస్సు కంటే ఎక్కువ ఉన్న పురుషుల పట్ల ఎందుకు ఆకర్షితులవుతారు?


పరిపక్వత..

అమ్మాయిలలో కంటే అబ్బాయిలలో మెచ్యూరిటీ కొంచెం ఆలస్యంగా వస్తుంది. అయితే, అమ్మాయిలు పరిణతి చెందిన మగవారిని ఎక్కువగా ఇష్టపడతారు. ఆమె తన వయస్సు కంటే పెద్దవారితో డేటింగ్ చేయడానికి ఇష్టపడుతుంది. ఈ మగవారితో రిలేషన్ సురక్షితంగా ఉంటుందని నమ్ముతారు. అర్థం చేసుకునే తనంతో ఎలాంటి చిక్కులు రాకుండా తమ బంధాన్ని కాపాడగలరని భావిస్తారు. జీవితంలో అతనికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇద్దరి బంధం పటిష్టంగా ఉంటుందని ఆలోచిస్తారు. 

 

అనుభవం..

వయసులో పెద్దవారు.. అమ్మాయిలలో హాస్యాన్ని, చిలిపితనం, చురుకుతాన్ని ఇష్టపడతారు. జీవితంలో, పర్సనల్ లైఫ్ లో అనుభవజ్ఞులైన పురుషులు స్త్రీలను పూర్తిగా అర్థం చేసుకుంటారని అమ్మాయిల నమ్మకం. అంతేకాదు చురుకైన లైంగిక జీవితాన్ని గడిపిన అనుభవంతో వయసులో పెద్దవారు యువకుల కంటే కూడా సెక్స్ లో మరింత నమ్మకంగా ఉంటారట.

 

ఆర్ధిక స్థిరత్వం..

తరచుగా మహిళలు తమ కంటే పెద్ద పురుషుల పట్ల ఆకర్షితులవుతున్నారంటే వారు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం వల్లే... జీవితంలో కుటుంబ బాధ్యతలన్నీ తీరిపోయి ఆర్థికమైన స్థిరత్వం కలిగి ఉంటారు. అమ్మాయిల ఖర్చులను సులభంగా భరించగలరు. ఆర్థికంగా స్వతంత్ర కలిగి తన కోరికలన్నీ తీరుస్తాడనే నమ్మకంతోనే పురుషుడికి తన హృదయాన్ని ఇస్తుంది. ఈ నమ్మకంతోనే బంధాన్ని కొనసాగిస్తారు.


విశ్వాసం..

వృద్ధుల విశ్వాస స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తరచుగా అమ్మాయిలను చాలా ప్రభావితం చేస్తుంది. అబ్బాయిలలా కాకుండా సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తారు. అమ్మాయిలో నిజాయితీని ఎక్కువగా ఇష్టపడతారు. చాలా మంది యువకులు సెక్స్ ని టైమ్ పాస్ గా భావిస్తుంటారు. అయితే.. వయసులో పెద్దవారు మాత్రం అలా టైం పాస్ చేయాలని అనుకోరట. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. వీరితో సెక్స్.. ఎమోషనల్ గా కనెక్షన్ తెస్తుందట.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ఫ్యామిలీ కౌన్సిలింగ్Latest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.