ఎవరికి ఓటు వెయ్యాలి?

ABN , First Publish Date - 2021-03-09T06:50:21+05:30 IST

ఓటు వేసే ముందు ఎవరికి వేస్తే, ఆ ఓటు పూర్తిగా సద్వినియోగం ఔతుందో తెలుసుకుని మరీ ఓటు వేయాలి. సమాజాభివృద్ధికి ఏ అభ్యర్థి సేవ చేస్తారోనన్న...

ఎవరికి ఓటు వెయ్యాలి?

ఓటు వేసే ముందు ఎవరికి వేస్తే, ఆ ఓటు పూర్తిగా సద్వినియోగం ఔతుందో తెలుసుకుని మరీ ఓటు వేయాలి. సమాజాభివృద్ధికి ఏ అభ్యర్థి సేవ చేస్తారోనన్న అవగాహనతో ఆలోచించి ఓటేయాలి. ఈ విషయంలో ఏ పార్టీకి చెందని మేధావులు అలోచించి సామాన్య ఓటర్లను గైడ్ చెయ్యాలి. ఇపుడు అనాలోచితంగా.. ఎవరికి తోస్తే వారికి బ్లైండ్ గా ఓటేస్తే.. ఆ పై ఐదేళ్లూ మనమందరం భాదపడాల్సి వస్తుంది. ఇది ప్రజాస్వామిక వ్యవస్థ. ఇక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నుకున్న నాయకులే పరిపాలన చేయాలి. ఎన్నికైన నాయకులు అవినీతికి దూరంగా, బంధు ప్రీతికి అతీతంగా.. రాజ్యాంగ బద్దంగా, అమలులో ఉన్న చట్టాలకు లోబడి మాత్రమే పరిపాలన చేయాలి. అలా పరి పాలన చేస్తారని మనకు నమ్మకం కుదురుతేనే ఆ నాయకుడికి మనం ఓటువేయాలి. ప్రజా జీవితంలో ఉండే వారికి నిరంకుశ ధోరణి పనికి రాదు. అలా డిక్టేటర్ లా ఆలోచించే వారిని ఎన్నుకుంటే ఇక రాబోయే ఐదేళ్లు మనకు బాధలు తప్పవు. సోంబేరులకు ఓటు వేస్తే కూడా పరిపాలన మొత్తం అధోగతి పాలౌతుందని తెలుసుకోండి. ఇపుడున్న అస్తిపన్నును అడ్డగోలుగా పెంచాలనుకునే వారికి ఓటు వేస్తే కూడా మనకు ఇబ్బందులు తప్పవు. మంచివారిని ఎన్నుకుంటే మంచిపాలన అందిస్తారు. బాగా ఆలోచించండి.. డబ్బుకి మీ ఓటును అమ్ముకోవద్దు. సారాయి పోయించిన వారికి ఓటు వెయ్యవద్దు. మన కులపోడని, మన మతపోడని చూసుకుని ఓటు వెయ్యవద్దు. కులం, మతం మన కడుపులు నింపవు. కాబట్టి కుల మతాలకు అతీతంగా ఆలోచించి ఓటువెయ్యాలి. అలా మీ ఓటును సక్రమంగా ఆలోచించి వేయకపోతే ..రేపు మీరు వారిని నిలదీసే హక్కును కోల్పోతారు. ఎవరు నిజాయతీగా పాలన చేస్తారని అనుకుంటారో వారికి మాత్రమే వెయ్యండి. అలావేసినపుడే, గెలిచిన వారు రేపు సరిగా చెయ్యకపోతే, మన ఓట్లతో గెలిచిన వ్యక్తులను మనమే  నిలదియ్య వచ్చు. అందుకే ఓటువేసే ముందే ఆలోచించండి, ఆలోచించి మరీ ఓటు వేయ్యండి. అనాలోచితంగా ఓటెయ్యకండి.

నార్నె వెంకటసుబ్బయ్య

Updated Date - 2021-03-09T06:50:21+05:30 IST