నీరజ్ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూడండి..!

ABN , First Publish Date - 2021-08-08T01:06:28+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకంతో చరిత్ర సృష్టించాడు మన బల్లెం బుల్లోడు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోలో ఏకంగా 87.58 మీటర్లతో స్వర్ణపతాకాన్ని ఒడిసి పట్టుకున్నాడు.

నీరజ్ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూడండి..!

పానిపట్: టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకంతో చరిత్ర సృష్టించాడు మన బల్లెం బుల్లోడు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోలో ఏకంగా 87.58 మీటర్లతో స్వర్ణపతాకాన్ని ఒడిసి పట్టుకున్నాడు. ఈ సమయంలో నీరజ్ స్వగ్రామం హరియాణాలోని పానిపట్‌లో పండగ వాతావరణం నెలకొంది. నీరజ్ ఇంటి ముందు ప్రజలు గుంపులుగా చేరి సంబరాలు చేసుకున్నారు. నీరజ్ పెర్ఫామెన్స్ చూడటం కోసం అప్పటికే టెంట్లు వేసుకొని కూర్చున్న స్థానికులు.. అతను స్వర్ణ పతకం గెలవడంతో ఆనంద డోలికల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా నీరజ్ తండ్రి మాట్లాడుతూ.. ‘‘వాడు ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేశాడో మేమంతా చూశాం. తను ఒక మెడల్ తీసుకొస్తాడని మాకందరికీ కచ్చితంగా తెలుసు’’ అని చెప్పారు. దేశం కల తన కొడుకు తీర్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.




డ్యాన్స్ చేసి హోం మంత్రి!

నీరజ్ బంగారు పతకం గెలవడాన్ని టీవీలో చూసిన హరియాణా హోంమంత్రి అనిల్ విజ్ ఆనందంతో గంతులు వేశారు. చిన్నపిల్లాడిలా సంతోషంతో డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కాగా, జమ్మూకశ్మీర్‌లోని సీఆర్పీఎఫ్ దళాలు కూడా నీరజ్ పతకాన్ని సెలబ్రేట్ చేసుకున్నాయి. సీఆర్పీఎఫ్ సిబ్బంది జాతీయ జెండా ఊపుతూ, పాటలు పాడుతూ, డప్పులు కొడుతూ నీరజ్‌ ఫీట్‌ను మెచ్చుకున్నారు.





Updated Date - 2021-08-08T01:06:28+05:30 IST