టీమిండియా క్లీన్‌స్వీప్

ABN , First Publish Date - 2022-07-29T09:58:43+05:30 IST

వెస్టిండీస్‌‌తో జరిగిన మూడో వన్డేలో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన 119 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

టీమిండియా క్లీన్‌స్వీప్

ఆఖరి వన్డేలోనూ విండీస్‌ ఓటమి

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: వెస్టిండీస్‌‌తో జరిగిన మూడో వన్డేలో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన 119 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. కరీబియన్‌ దీవుల్లో విండీస్‌తో జరిగిన వన్డేల్లో భారత్‌కిదే భారీ విజయం. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో భారత్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. ముందుగా 40 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించగా.. 36 ఓవర్ల వద్ద భారత్‌ 225/3 స్కోరుతో ఉన్న దశలో మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో అక్కడే భారత్‌ ఇన్నింగ్స్‌ను ముగించడంతో 98 పరుగులతో అజేయంగా ఉన్న గిల్‌ సెంచరీ చేయలేకపోయాడు. ఇక 35 ఓవర్లలో 257 పరుగుల ఛేదనకు బరిలో దిగిన విండీస్‌.. స్పిన్నర్‌ చాహల్‌ (4/17) వణికించడంతో 26 ఓవర్లలో 137 రన్స్‌కే కుప్పకూలింది. కింగ్‌ (42), పూరన్‌ (42) రాణించారు. సిరాజ్‌, శార్దూల్‌కు రెండేసి వికెట్లు దక్కా యి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా గిల్‌ నిలిచాడు. 


రెండో స్థానంలో ధవన్‌:

విండీస్‌ పర్యటనలో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా ధవన్‌ నిలిచాడు. అతడు 17 మ్యాచ్‌ల్లో  516 రన్స్‌ చేశా డు. ధోనీ(458), యువరాజ్‌(419), రోహిత్‌(408)ను అధిగమించాడు. టాప్‌లో కోహ్లీ (15 మ్యాచ్‌ల్లో 790) ఉన్నాడు.

Updated Date - 2022-07-29T09:58:43+05:30 IST