Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన బ్రావో

ఇంటర్‌నెట్‌డెస్క్: వెస్టిండీస్​ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 వరల్డ్‌కప్​ టోర్నీ ముగిశాక క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు ప్రకటించాడు. గతరాత్రి  శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో విండీస్ ఓటమి తర్వాత ఆయన ఈ ప్రకటన చేశాడు.


18 ఏళ్లుగా వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించానని, ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని ఆయన అన్నాడు. వెస్టిండీస్ జట్టులో ఆడటం ఎల్లప్పుడూ అదృష్టంగానే భావిస్తున్నానని డ్వేన్‌ బ్రావో అన్నాడు. గురువారం శ్రీలంకతో మ్యాచ్ అనంతరం ఫేస్‌బుక్ లైవ్‌లో బ్రావో ఈ వ్యాఖ్యలు చేశాడు.

Advertisement
Advertisement