Abn logo
Jul 6 2020 @ 11:11AM

ఏలూరు: మద్యం దుకాణంలో దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలోని మద్యం దుకాణంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన పిల్లి వెంకటేశ్వరావు అనే అంతరాష్ట్ర దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నిందితుడి నుంచి రూ.1,30,000 విలువ చేసే 406 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఆంధ్ర, తెలంగాణలో కలిపి 15 దొంగతనాలు, 30కి పైగా నాటు సారా కేసులు, ఒక చైన్ స్నాచింగ్, పీడీ యాక్టు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement