ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ కోయ కాంచనమాల(83) కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం కాలుజారి పడడంతో డాక్టర్ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు(సోమవారం) ఉదయం మృతిచెందారు. కాంచనమాల తన సర్వీసులో దాదాపు రెండు లక్షల 13 వేలు ప్రసూతి కేసులు చేశారు. వీటిలో రెండు లక్షలకుపైగా సాధారణ ప్రసూతి కేసులు ఉన్నాయి.