‘అక్షరయాన్‌’ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన కవిత

ABN , First Publish Date - 2021-01-16T15:47:30+05:30 IST

మహిళలపై జరుగుతున్న వేధింపులపై అక్షరాలే ఆయుధాలుగా తమ రచనల ద్వారా సమాజంలో మార్పునకు పాటుపడుతున్న ‘అక్షరయాన్‌ తెలుగు మహిళా రచయితల

‘అక్షరయాన్‌’ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన కవిత

హైదరాబాద్‌, జనవరి15 (ఆంధ్రజ్యోతి): మహిళలపై జరుగుతున్న వేధింపులపై అక్షరాలే ఆయుధాలుగా తమ రచనల ద్వారా సమాజంలో మార్పునకు పాటుపడుతున్న ‘అక్షరయాన్‌ తెలుగు మహిళా రచయితల ఫోరమ్‌’ సభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు.  ‘తెలుగు మహిళా రచయితల ఫోరం-అక్షరయాన్‌’కు చెందిన 25 మంది రచయిత్రులు, ప్రముఖ రచయిత్రి ఐనంపూడి శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవితను శుక్రవారం  హైదరాబాదు లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా http//aksharayan.org వెబ్‌ సైట్‌ను కవిత ఆవిష్కరించారు. వెబ్‌సైట్‌ రూపకర్తలను అభినందించారు. ‘‘తమిరిశ జానకి కవితల పోటీ’’ లో గెలుపొందిన రచయిత్రిలకు బహుమతులు అందజేశారు. 


Updated Date - 2021-01-16T15:47:30+05:30 IST