‘ప్రకృతి వనం’ ఏర్పాటు చేస్తాం

ABN , First Publish Date - 2020-07-02T11:32:03+05:30 IST

మండల కేంద్రమైన జఫర్‌గఢ్‌లో ప్రకృతి వనం (నేచర్‌ పార్కు)ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ నిఖిల తెలిపారు

‘ప్రకృతి వనం’ ఏర్పాటు చేస్తాం

జనగామ కలెక్టర్‌ నిఖిల 

జఫర్‌గడ్‌లో స్థల పరిశీలన


జఫర్‌గడ్‌, జూలై 1 : మండల కేంద్రమైన జఫర్‌గఢ్‌లో ప్రకృతి వనం (నేచర్‌ పార్కు)ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ నిఖిల తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం ఫారెస్ట్‌ చీఫ్‌ కన్జర్వేటీవ్‌ అధికారి ఎంజె అక్బర్‌, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె జఫర్‌గడ్‌లో నేచర్‌ పార్కు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వనం ఏర్పాటుకుగాను సాంకేతిక సలహాలు, సూచనల మేరకు ప్రణాళిక మ్యాప్‌ను సిద్ధం చేయాలని ఈసీని ఆదేశించారు. అలాగే మండలంలోని తిడుగు గ్రామపరిధిలోని చారిత్రక దంసా చెరువునూ ఆమె సందర్శించారు. ఈ కార్యక్రమాల్లో డీఆర్‌డీఓ రాంరెడ్డి, జిల్లా ఫారెస్ట్‌ అధికారి రామలింగం, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆర్డీఓ రమేశ్‌, ఎంపీపీ సుదర్శన్‌, ఎంపీడీఓ శ్రీధర్‌స్వామి, వైస్‌ ఎంపీపీ కనకయ్య, ఎంపీఓ శ్రీనివాస్‌, జఫర్‌గడ్‌ సర్పంచ్‌ వెంకటనర్సింగరావు, రైతు సమితి మండల కోఆర్డినేటర్‌ శంకర్‌, ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. 


బాధ్యతగా మొక్కలు నాటాలి

జనగామ టౌన్‌ : పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సామాజిక బాధ్యతగా ప్రతీ ఒక్కరు హరితహారంలో భాగస్వాములై, మొక్కలు నాటాలని కలెక్టర్‌ నిఖిల పిలుపునిచ్చారు. జనగామ మునిసిపాలిటీలోని రెండోవార్డు పరిధిలో బతుకమ్మకుంట, దుర్గనగర్‌లో బుధవారం హరితహారం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథి హాజరై మొక్కలు నాటి, మాట్లాడారు. మునిసిపాలిటీని హరితవనంగా మార్చేందుకు అందరూ విరివిగా మొక్కలు పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ జమున, కౌన్సిలర్‌ వాంకుడోతు అనిత, కమిషనర్‌  రవీందర్‌యాదవ్‌, వైస్‌చైర్మన్‌ రాంప్రసాద్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పోకల లింగయ్య, తహసీల్దార్‌ దేవేందర్‌, మాజీ కౌన్సిలర్‌ గజ్జెల నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-02T11:32:03+05:30 IST