మహబూబ్ నగర్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే కొడంగల్-నారాయణపేట లిఫ్టు స్కీంను పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి అన్నారు. పాలమూరు వలసలపై పలు వివరాలను పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ వివరాలను ఎండగడుతూ సోషల్ మీడియా అయిన ఫేస్ బుక్లో ఆమె పోస్ట్ చేశారు. పాలమూరు పచ్చబడిందని, వలసలు పూర్తిగా ఆగిపోయాయని సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. నిజానికి పాలమూరులో వలసలు ఆగలేదన్నారు. రోజూ ముంబైకి వందలాది మంది వలస వెళుతూనే ఉన్నారని ఆమె తెలిపారు.
పాలమూరు పచ్చబడాలంటే కేసీఆర్ని గద్దె దించడం ఒక్కటే మార్గమని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. నారాయణపేట నుంచి రోజూ వందల సంఖ్యలో ప్రజలు ఉపాధి కోసం ముంబై వెళుతున్నారని ఆమె పేర్కొ్న్నారు. ఇక్కడి నుంచి ప్రతిరోజూ నాలుగైదు బస్సులు ముంబై వెళ్తున్నాయన్నారు. కేవలం రూ. 1,400 కోట్లు ఖర్చు చేస్తే నారాయణపేట జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు కృష్ణా జలాలు వచ్చే అవకాశమున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ఫేస్బుక్లో ఆమె పోస్ట్ చేసిన వార్త యథాతథంగా మీకోసం..
ఇవి కూడా చదవండి