Abn logo
Mar 30 2020 @ 04:33AM

రూ. 30 లక్షలు.. ప్రశాంత జీవనం

ధోనీ కోరుకున్నది ఇదే

న్యూఢిల్లీ: ‘క్రికెట్‌లో రూ. 30 లక్షలు సంపాదించాలి.. రాంచీలో హాయిగా జీవించాలి’ జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో ధోనీ ఇదే కోరుకునే వాడని రంజీ దిగ్గజం వసీం జాఫర్‌ చెప్పాడు. ఒకప్పుడు మహీతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకున్న జాఫర్‌ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ‘జట్టులోకి వచ్చిన తొలి ఏడాది అతడు అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. క్రికెట్‌ ఆడుతూ రూ. 30 లక్షలు సంపాదించాలి. రాంచీలో ప్రశాంత జీవితం గడపాలి అని అతను కోరుకున్నాడు’ అని ట్విటర్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు జాఫర్‌ సమాధానమిచ్చాడు. 

Advertisement
Advertisement
Advertisement