కరోనా ఎఫెక్ట్... ఆ వాహనాలకు వారంటీ పొడిగింపు...

ABN , First Publish Date - 2021-05-18T00:55:24+05:30 IST

హోండా స్కూటర్, బైక్ వాహనాలకు ఉచిత సర్వీసింగ్ వెసులుబాటు కల్పిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది.

కరోనా ఎఫెక్ట్... ఆ వాహనాలకు వారంటీ పొడిగింపు...

న్యూఢిల్లీ : హోండా స్కూటర్, బైక్ వాహనాలకు ఉచిత సర్వీసింగ్ వెసులుబాటు కల్పిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో... వాహనదారులకు ఊరట కలుగనుంది. వివరాలిలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌కు కంపెనీ నిర్ణయం వర్తిస్తుంది.


ఈ క్రమంలో... ఈ ఏడాది జూలై 31 వరకు వారంటీ, వెహికల్ సర్వీస్ పొడిగింపు అందుబాటులో ఉంటుంది. హోండా టూవీలర్ కస్టమర్లకు ఈ వెసులుబాటు ఇది వర్తిస్తుంది. అయితే... ఏప్రిల్ 1 నుంచి మే 31 మధ్యలో వారంటీ, ఉచిత సర్వీస్, ఎక్స్‌టెండెడ్ వారంటీ అయిపోయే హోండా టూవీలర్లకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుంది. హోండా మాత్రమే కాకుండా ఇప్పటికే చాలా కంపెనీలు వారంటీ పొడిగింపు నిర్ణయాన్ని వెల్లడించాయి.


కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే హ్యుందయ్, టయోటా, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి కంపెనీలు వారంటీ పొడిగింపు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా... ద్విచక్ర వాహనాల విభాగంలో యమహా కంపెనీ వారంటీని పొడిగించింది. జూన 30 వరకు పొడిగింపు నిర్ణయం అమల్లో ఉంటుంది. 

Updated Date - 2021-05-18T00:55:24+05:30 IST