Abn logo
Apr 12 2021 @ 10:29AM

టాల్ బౌలర్స్‌ను ఆడలేకపోయాం: వార్నర్

కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌లో పొడగరి బౌలర్లు ఎక్కువగా ఉన్నారని, వారు వేసిన క్రాస్ సీమ్ బంతులను సమర్థంగా ఆడలేకపోయామని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. కేకేఆర్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ టీమ్ 10 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన వార్నర్.. తమ టీమ్ వైఫల్యం గురించి స్పందించాడు. 


`పరుగులు భారీగా వచ్చాయి. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. వికెట్‌ను చక్కగా అర్థం చేసుకున్న కేకేఆర్‌ మంచి భాగస్వామ్యాలు నమోదు చేసి గెలుపును సొంతం చేసుకుంది. మేము ఆరంభంలో వికెట్లు కోల్పోయినా మనీష్‌-బెయిర్‌ స్టో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సీమ్‌ విభాగంలో మా కంటే కేకేఆర్‌ మెరుగ్గా కనిపించింది. కోల్‌కతా జట్టులోని పొడగరి బౌలర్లు వేసిన క్రాస్ సీమ్ డెలివరీస్‌ను మేం సమర్థంగా ఆడలేకపోయామ`ని వార్నర్ అన్నాడు. 

Advertisement
Advertisement
Advertisement