ఉమ్మడి వరంగల్: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో కరోనా కలకలం రేపుతోంది. గతవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, నిరంజన్ రెడ్డి పర్యటనలో పాల్గొన్న వారికి పాజిటివ్ వచ్చింది. ఆ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులకు, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు కోవిడ్ పాజిటీవ్ వచ్చింది. మంత్రుల బందోబస్తులో పాల్గొన్న పరకాల సీఐ సహా 10 మంది పోలీసులకు కోవిడ్ వచ్చింది. దీంతో పోలీస్ సిబ్బంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.