Abn logo
May 23 2020 @ 07:38AM

గొర్రెకొంటలో మరణాలపై కొనసాగుతున్న మిస్టరీ

వరంగల్: జిల్లాలోని గొర్రెకుంటలో తొమ్మిది మంది మరణాలపై మిస్టరీ కొనసాగుతోంది. కొత్త అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి. స్థానిక భూమాఫియానే తొమ్మిది మంది ప్రాణాలు తీసిందా? తమ అడ్డాలో భయోత్పాతం సృష్టించి భూయజమానులు పారిపోవాలనే పథకమా...? పన్నారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అలాగే వలసకార్మికులకు అన్నదానం పేరుతో పంపిణీ చేసిన ఫుడ్ లో విషం కలిపారా? అందరినీ అంతమొందించి స్థానికంగా భయోత్పాతం సృష్టించాలనుకున్నారా ? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు గొర్రెకుంటలో భూవివాదాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు. 


పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం వరంగల్‌కు కుటుంబంతో సహా వలస వచ్చాడు. నగరంలోని కరీమాబాద్‌ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉండేవారు. డిసెంబరు నెల నుంచి గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వరంగల్‌ నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో.. నెలన్నర నుంచి గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్‌తో పాటు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. భర్తతో విడిపోయిన కుమార్తె బుస్రా ఆలం కూడా తన మూడేళ్ల కుమారుడితో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వీరితో పాటుగా గన్నీ సంచుల గొదాం పక్కనే ఉన్నపై భవనంలో బిహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాంలు కూడా నివసిస్తూ గోదాంలో పనిచేస్తున్నారు. 


పరిశ్రమ యజమాని సంతోష్‌ రోజూలాగే గోదాం వద్దకు వచ్చే సరికి కార్మికులెవరూ కనిపించలేదు. పరిసరాల్లో అన్వేషించినా జాడ లేకపోవడంతో.. పక్కనే ఉన్న పాడుబడ్డ బావిలో చూశారు. నాలుగు మృతదేహాలు నీళ్లలో తేలాడుతూ కనిపించాయి. పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన వారు అక్కడికి చేరుకున్నారు. ఓకే కుటుంబానికి చెందిన మాసూద్ అలం (50) నిషా అలం (భార్య)  (45), బూస్రా అలం (22) ఈమె మూడు సంవత్సరాల బాలుడుదేహాలు బావిలో నుంచి వెలికి తీశారు. ఇవాళ బావిలో నీటిని తోడుతుండగా మసూద్ అలం పెద్ద కుమారుడు శబాజ్ అలం (21), చిన్న కుమారుడు సోహిల్ అలం (20) వీరితో పాటు గోనె సంచుల గోదాం వద్దకు వాహనాలను నడిపే డ్రైవర్  షకీల్ (40)తో పాటు బీహార్‌కు చెందిన శ్రీరామ్ (35), శ్యామ్ (40)ల మృతదేహాలు వెలికి తీశారు.

Advertisement
Advertisement
Advertisement