సర్వోదయ స్వచ్చంధ సంస్థకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

ABN , First Publish Date - 2021-07-26T21:20:35+05:30 IST

వరంగల్ సర్వోదయ స్వచ్చంధ సంస్థకు లండన్ వరల్డ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.

సర్వోదయ స్వచ్చంధ సంస్థకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

వరంగల్: లాక్ డౌన్ సమయంలో కోవిడ్ బాధితులకు ఆహారం, మందులు అందజేసినందుకు వరంగల్ సర్వోదయ స్వచ్చంధ సంస్థకు లండన్ వరల్డ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. కోవిడ్ కష్టకాలంలోనే కాకుండా పేదలు, మహిళల అభ్యున్నతికి తమ వంతుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని సంస్థ నిర్వాహకులు దామోదర్ చెప్పారు. లాక్ డౌన్ కాలంలో కూలీలకు, కోవిడ్ బాధితులకు అందించిన సేవలను గుర్తించి తమకు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.

Updated Date - 2021-07-26T21:20:35+05:30 IST