పౌరుషం ఉంటే ఉంటే రాజీనామా చేయి..

ABN , First Publish Date - 2022-08-10T05:58:52+05:30 IST

పౌరుషం ఉంటే ఉంటే రాజీనామా చేయి..

పౌరుషం ఉంటే  ఉంటే రాజీనామా చేయి..

-‘తూర్పు’ ఎమ్మెల్యే నరేందర్‌కు సవాల్‌.. నేటి వరకు గడువు.. 

-రైల్వేగేట్‌ సమీపంలో ఆర్వోబీ పిల్లర్లకు వెలిసిన పోస్టర్లు 

వరంగల్‌టౌన్‌,  ఆగస్టు 9: ‘ఓ రుగల్లు గడ్డమీద పుట్టిన బిడ్డగా పౌరుషం ఉంటే ఎమ్మెల్యే పదవికి (నరేందర్‌) రాజీనామా చేసి ఎ న్నికలకు రా... నేను ఏ పార్టీకి సంబంధంలేకుండా ఇండిపెండెం ట్‌గా పోటీ చేస్తా...’ అంటూ ఎర్ర బెల్లి ప్రదీప్‌రావు బొమ్మ తో వరం గల్‌ నగరంలో గోడ పత్రికలు వె లియడం చర్చనీయాంశమైంది. మంగళవారం వరంగల్‌ రైల్వే గేటు సమీపంలో ఆర్వోబీ పిల్లర్ల కు ‘ఆగస్టు 10 సవాల్‌’ పేరుతో ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బొమ్మతో ఉన్న గోడ పత్రికలు దర్శనమిచ్చా యి. దీంతో వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల హడావిడి మొదల యిందా అన్నట్లు కనిపిస్తోంది. పోస్టర్ల విషయం  సోషల్‌ మీడి యాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ పోస్టర్లు గుర్తు తెలియని వక్తులు అంటించినట్లు చె పుతున్నా... ఇది కచ్చితంగా ఎర్రబెల్లి ప్రదీప్‌రావు అనుచరుల పనే అంటూ ప్రచారం సాగుతోంది. ఈ చిత్రాలనే ఫేస్‌బుక్‌లో ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, ఆయన అనుచరుల వాల్స్‌పై పోస్ట్‌ చేయడం అనుమానాలను బలపరుస్తోంది. 

కొద్ది రోజులుగా కోల్డ్‌వార్‌.. 

ఇటీవల కాలంలో అధికార పార్టీలో అసమ్మతి పెరిగిపోయింది. దీంతో ఎమ్మెల్యేకు.. అసమ్మతి నాయకుల మధ్య మరింత దూరం పెరిగింది. ఈక్రమంలో ఈనెల 5న ఎమ్మెల్యే నరేందర్‌ తన పుట్టిన రోజు సందర్భంగా అసమ్మతి వర్గాన్ని ఉద్దేశిస్తూ పౌ రుష పదజాలంతో దూషించారు. ఇదేనెల 7న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోద రుడు, టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు విలేకరుల సమావేశం పెట్టి వెల్లడించారు. మా కృషి లేకుండానే ఎమ్మెల్యేగా గెలిచా నని అనుకుంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని, తను ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఎమ్మెల్యేకు బహిరంగ సవాల్‌ విసిరారు. ఇందుకోసం ఆగస్టు 10వరకు సమయం ఇస్తున్నట్లు ప్రకటించి తూర్పులో ఎన్నికల వేడి పుట్టించారు. అదే ప్రకటన తరహాలో పోస్టర్లు వెలువడడంతో ఇది ఆయన అను చరుల పనే అనే చర్చసాగుతోంది. 

‘ఆగస్టు 10 సవాల్‌’ పేరుతో పోస్టర్లు 

‘ఆగస్టు పది వరకు గడువు ఇస్తున్నాం.. నాడు కాళ్లవేల్ల పడ్డ నువ్వు(నన్నపనేని నరేందర్‌)ఈ రోజు స్థాయి మరిచి మాట్లాడుతున్నావ్‌.. దమ్ముంటే  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రా... ఏ పార్టీకి సంబంధంలేకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేసే దమ్ము నాకుంది. ఆగస్టు10 వరకు గడువు ఇస్తున్నాం. ఓరుగల్లు గడ్డమీద పుట్టిన బిడ్డగా పౌరుషం ఉంటే సవాల్‌ స్వీకరించు.. లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పు బుద్ధిలేని (నన్నపనేని) నరేందర్‌ అంటూ పోస్టర్‌లో పేర్కొన్నారు.  

బీజేపీలో చేరేందుకు ప్రదీప్‌రావు రంగం సిద్ధం?

ఈనెల 10వ తారీకు తర్వాత బీజేపీలో చేరేందుకు ప్రదీప్‌రావు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర వరంగల్‌ చేరు కోనున్న  సమయంలో పార్టీలో చేరేందుకు ప్రణాళిక వేసుకున్నట్లు సమాచారం.



Updated Date - 2022-08-10T05:58:52+05:30 IST