‘వృక్షవేదం’ పుస్తకావిష్కరణ

ABN , First Publish Date - 2020-12-08T08:42:03+05:30 IST

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతో్‌షకుమార్‌ జన్మదినం సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ప్రచురించిన ‘

‘వృక్షవేదం’ పుస్తకావిష్కరణ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 7(ఆంధ్రజ్యోతి): రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతో్‌షకుమార్‌ జన్మదినం సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ప్రచురించిన  ‘వృక్షవేదం’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ సంపాదకత్వంలో సాంస్కృతిక శాఖ డైరక్టర్‌ మామిడి హరికృష్ణ ఈ పుస్తకాన్ని రచించారు. భారతీయ సాహిత్యంలోని వృక్షాలు, వనాల ప్రశస్తి శ్లోకాలు, తెలంగాణ అటవీ సౌందర్య ఫొటోలను జతచేసి ప్రచురించారు.


  ‘వృక్షవేదం’ పుస్తకాన్ని రూపొందించిన ఎంపీ సంతో్‌షకుమార్‌ను సీఎం కేసీఆర్‌ అభినందించారు. ‘‘వృక్షాలను దైవంగా భావించే సంస్కృతి మనది. తెలంగాణ ప్రభుత్వ నిరంతర కృషితో హరిత తెలంగాణ కల సాకారమవుతోంది.’’ అని కేసీఆర్‌ అన్నారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న,  దేశపతి శ్రీనివాస్‌, మామిడి హరికృష్ణ, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాఘవ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-08T08:42:03+05:30 IST